టిఆర్ఎస్ విజయానికి యువత పాటుపడాలి

రాబోయే రోజుల్లో యువతకు పార్టీలో మరింత అవకాశాలు
… ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్11,( జనం సాక్షి) : వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవ గాహన కల్పిస్తూ టిఆర్ఎస్ విజయానికి యువత పాటుపడాలని తెలంగాణతొలిఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. డివిజన్ కేంద్రంలోని శివునిపల్లి పద్మావతి కన్వెన్ష న్ హాల్ నందు స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యుత్ ఇంచార్జ్ మారేపల్లి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన యువగర్జన కు  ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డితో కలిసి జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లచట్టాలు తీసుకువచ్చి రైతులను అనేకఇబ్బందులకు గురి చేసిన బిజెపికి రైతుల ఉసురు తగులుతుందని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతు బీమా,రైతుబంధు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మహిళా సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. దళితు లు ఆర్థికంగా ఎదగడానికి దళిత బంధు పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల అందించడంజరుగుతుందన్నారు.టిఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా, అందిన పథకాలపై ప్రజల కు అవగాహన కల్పించేందుకు యువత ముందు ఉండాలి అన్నారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి యువత అండగా ఉండాలని,ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో యువతకు పార్టీలో మరింత అవకాశాలు దక్కుతాయని అన్నారు.బిజెపి ప్రభు త్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ టిఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాల పై యువత ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తెలంగా ణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి కార్పొరేష న్ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమం త్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకా లు ప్రజలందరికీ తెలియజేసేలా సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య చేస్తున్న అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ఇంచార్జ్ లుప్రచారంచేయాల్సిన అవసరం ఉందన్నారుతెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మంచి చేస్తున్నప్పటికీ, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణరాష్ట్రానికి ఏమీ చేయకుండా, టిఆర్ఎస్ ప్రభుత్వం పై అసత్య ప్రచారం చేస్తుందని, బిజెపి అసత్య ప్రచారాలను యువత తిప్పికొట్టాలని అన్నారు. ఈ సమావేశం లో జనగామ జిల్లాపరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి,జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య, జాఫర్ గడ్ జెడ్పిటి సి బేబీ శ్రీనివాస్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పం చ్ తాటికొండ సురేష్ కుమార్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ గౌడ్, టిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మారపెల్లి ప్రసా ద్, రంగు రమేష్, రంగు హరీష్ , జోగు కుమార్, మల్లేష్, అశోక్, నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపిపిలు, మండల పార్టీ అధ్యక్షులు,యువజన నాయకులు, మహిళనాయకురాలు,పాల్గొన్నారు.
Attachments area