టీఆర్‌ఎస్‌అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌;టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ప్రజాస్వామ్య బద్దంగా ఆ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ మేరకు ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నరసింహరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 24,25తేదీల్లో నామినేషన్లు ఉపసంహరణకు అవకాశమిస్తున్నామని తెలిపారు.అనంతరం అభ్యర్థుల జాబితా ఖరారు చేస్తామని తెలిపారు.27న అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు.