టీఆర్‌ఎస్ అహంకారంవల్లే.. : జైపాల్ రెడ్డి
వరంగల్: టీఆర్‌ఎస్ అహంకారపూరిత వైఖరికి ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారన్నారు కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని ఆరోపించారు.. కాంగ్రెస్ ఎంపీలో పోరాటంవల్లే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాలేదని గుర్తుచేశారు..తెలంగాణాలో డిప్యూటీ సీఎం పదవికి విలువ లేదని, రాజయ్యను బర్తరఫ్ చేసి దళితులను కేసీఆర్ అవమానించారని జైపాల్‌రెడ్డి ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణాను 18 నెలల్లో కేసీఆర్ దివాలా తీయించారని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యాడని ఆయన దుయ్యబట్టారు.