టీకా తోనే పిల్లలకు శ్రీరామరక్ష

 ప్రాథమిక ఉప కేంద్రం వైద్యురాలు దీప
లోకేశ్వరం  ( జనం సాక్షి) చిన్నపిల్లలకు టీకాలే శ్రీరామరక్ష అని కనకాపూర్ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వైద్యురాలు దీప అన్నారు మంగళవారం రోజున ఆమె కేంద్రంలో టీకాల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు టీకాలు వేయడం వలన మెదడు వాపు వ్యాధి, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులు సోకే అవకాశం ఉండదని ఆమె అన్నారు సకాలంలో టీకాలు వేయించుకున్నట్లయితే ఆరోగ్యకరంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు జన్మించిన బిడ్డకు వెంటనే (ముర్రపాలు) తల్లిపాలు తాగించడంతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు