టీడీపీ విప్ జారీ చేయలేదు: కొడాలి నాని
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తనకు అసలు తనకు విప్ జారీ చేయలేదని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని అన్నారు. ఆయన గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. అనంతరం నాని విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే తమకు విప్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకమన్న బిబు ఈ వ్యవహరంపై ప్రజలు సమాధానం చెప్పాలని నాని డిమాండ్ చేశారు.
చంద్రబాబునాయుడును ప్రతిపక్ష నేతగా తొలగించి వైఎస్ విజయమ్మను ప్రతిపక్ష నేతగా నిమయించాలని స్పీకర్‌ను కోరినట్లు కొడాలి నాని తెలిపారు. అలాగే జూనియర్ ఎన్టీయర్ ప్లెక్సీలను పెట్టవద్దని ఆయన ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీయర్ ఫోటోను చంద్రబాబునాయుడు మినహా ఎవరైనా పెట్టుకోవచ్చని నాని అన్నారు.