టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని పోస్ట్ కార్డుల ఉద్యమం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టియూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా లో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయం వద్ద పోస్ట్ కార్డుల ఉద్యమంలో కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులు అందరూ తమ సమస్యలు పరిష్కరించాలని పోస్ట్ కార్డులు రాసి సీఎం కేసీఆర్ కు పోస్ట్ చేశారు .ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) మంచిర్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డేగ సత్యం పింగిళి సంపత్ రెడ్డి మాట్లాడుతూ …. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట లు కీలక పాత్ర పోషించారని , నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనేకసార్లు జర్నలిస్టుల కృషిని ప్రశంసించారని పేర్కొన్నారు .తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ లు ఎనలేని కృషి చేశారని ,జర్నలిస్టుల కృషిని రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందించారని తెలిపారు. స్వయంగా సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ నాలుగున్నర ఏళ్ళు గడిచినప్పటికీ ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు .ఆకస్మికంగా అనారోగ్యాలకు గురవుతున్న జర్నలిస్టులు చికిత్స పొందే ఆర్థిక స్థోమత లేక అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారని తెలిపారు . వైద్యం కోసం కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్లి అప్పుల పాలవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించి , జర్నలిస్టు హెల్త్ కార్డులను కార్పోరేట్ ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.ఈ పోస్ట్ కార్డుల ఉద్యమకార్యక్రమంలో టియూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రూపిరెడ్డి ప్రకాష్ రెడ్డి, కోశాధికారి వంశీ కృష్ణ, ఐజేయు కౌన్సిల్ మెంబర్ కాచం సతీష్ , జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ , సీ హెచ్ జనార్దన్ ఉదయ్ కుమార్, సాక్షి స్టాప్ రిపోర్టర్ రాజు , దేవరాజు, రాజేశ్వర్, లు పాల్గొన్నారు .

తాజావార్తలు