టీ కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సెగ
వరంగల్,(జనంసాక్షి): జిల్లాలో కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సెగ తగిలింది. హసన్‌పర్తి మండలం ఆరెపల్లిలో ఉరువాక ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ రాజయ్య, మంత్రి సారయ్య, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు వచ్చారు. తెలంగాణ కోసం రాజీనామా చేస్తామని చెప్పి పదవుల్లో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని గ్రామస్తులు వారిని నిలదీశారు. దీంతో ఏరువాక కార్యక్రమం ప్రారంభించకుండానే నేతలు వెనుదిరిగారు.