‘టీ మంత్రుల అసమర్థత వల్లే బయ్యారం గనుల కెటాయింపు’

వరంగల్‌;తెలంగాణ మంత్రుల అసమర్థతకు బయ్యారం  గనుల కేటాయింపులే నిదర్శనమని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష ఉపనేత టి.హరీష్‌రావు ఆరోపించారు.ఉద్యోగాలు, నీళ్లు,నిధులు దోచుకున్నందుకే తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఇంత ఉద్యమం జరుగుతున్నా తెలంగాణ వనరులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి తెలంగాణ మంత్రుల దన్ను ఉండడం వల్లనే సీమాంద్ర పాలకులు తెగబడుతున్నారని హరీష్‌రావు ధ్వజమెత్తారు.తెలంగాణ దయాదాాక్షిణ్యాలపైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నడుస్తుదని హరీష్‌రావు వివరించారు. విశాఖలో ఖనిజం లేకపోవడం తోనే బయ్యారం ఉనుప ఖనిజాన్ని దోచుకునేందుకు సీమాంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆయన ఆరోపించారు.మంత్రి గుంట శ్రీనివాసరావు ఇష్టమొచ్చినట్లు మాట్లాతున్నాడని , తెలంగాలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కానప్పుడు గ్యాస్‌ ఎలా, దేనికి నిలిపేస్తాడో చెప్పాలన్నారు.సీమాంద్రలో తుఫాను వస్తే యుద్ధ ప్రాతిపదికనే స్పందించే ప్రభుత్వం తెలంగాణలో పంట నష్టం జరిగితే పటించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగా