టూరిజంలో తెలంగాణ అభివృద్ధి చెందేలా కృషి చేస్తా
టూరిజంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని పేర్వారం రాములు చెప్పారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీఎం కేసీఆర్ తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని పెంచేలా.. టూరిజం డెవలప్ మెంట్ కు పాటుపడతానన్నారు. దేశ విదేశాలలో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు తెలిసేలా చర్యలు తీసుకుంటామని పేర్వారం రాములు చెప్పారు.