టెన్త్లో మెరుగగైన ఫలితాలు రావాలి
పరీక్షల కోసం అధికారుల కసరత్తు
ఆదిలాబాద్,మార్చి3(జనం సాక్షి): రానున్న పది పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని డీఈవో ప్రణిత అన్నారు. అన్ని ప్రభుత్వ పాటశాల్లో సిలబస్ ఊర్తి చేయించి రివిజన్ చేయించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు వారికి నాణ్యమైన, ఉన్నతమైన విద్యను అందించాలని సూచించారు. అదేవిధంగా ఉపాద్యాయులు సమయపాలన పాటిస్తూ రానున్న వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ప్రతి క్లాసు నుంచి ఉత్తమ పలితాలు సాధించేలా చూడాలన్నారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. మరోవైపు జిల్లాలోని సర్కారు బడుల్లో చదువుతున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు కరోనా మరోవైపు ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువులు వెనకబడ్డాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేశారు. అయితే ఈ విద్యాసంవత్సరం మాత్రం పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పదో తరగతి విద్యార్థులు మాత్రం ఇంకా సిలబస్ పూర్తికాకపోవడం, పరీక్షలకు తక్కువ గడువే ఉండడంతో ఏవిధంగా పాస్ అవుతామోనన్న ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యాసంవత్సరం సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభంకాగా కేవలం రెండు నెలలు మాత్రమే తరగతులు జరిగాయి. దసరా సెలవులు, ముందస్తు సంక్రాంతి సెలవులతో చదువులు అంతంతమాత్రంగానే జరిగాయి. కరోనా మూడో దశ వల్ల ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ఫిబ్రవరి వరకు సెలవులు ఉండగా పూర్తిస్థాయి సిలబస్ ఇంకా పూర్తికాలేదు. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో వార్షిక పరీక్షల షెడ్యూల్ సవిూపిస్తున్న వేళ ఫలితాలు ఏవిధంగా వస్తాయోనన్న ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు.