టెన్షన్ లో బీసీసీఐ..!!

లోధా కమిటీ సిఫారుసుల అమలుకు సంబంధించి స్పష్టత వచ్చేవరకూ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎటువంటి నిధులు మంజూరు చేయరాదంటూ గతంలో  సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇంగ్లండ్తో ద్వైపాక్షిక సిరీస్ను ఎలా నిర్వహించాలనే దానిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన హెటcricket_india_crest-svgల్, ప్రయాణపు ఖర్చులను మీరే భరించాలంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి విజ్ఞప్తి చేసిన బీసీసీఐ.. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం రాజ్కోట్లో జరిగే తొలి టెస్టుకు తగినన్ని నిధులు విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును కోరింది.