టైర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

మెదక్‌, జనంసాక్షి: జిన్నారం మండలం గడ్డిపోచారంలో ఉన్న ఒక టైర్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలియరాలేదు