టోల్ తీసుడే..
` వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం
` కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
దిల్లీ,సెప్టెంబరు 19(జనంసాక్షి): ప్రతిష్ఠాత్మక దిల్లీ`ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే.. నెలకు దాదాపు రూ.1,000`1,500 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడిరచారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) రానున్న రోజుల్లో కాసుల వర్షం కురిపించనుందన్నారు. టోల్ రూపంలో ఎన్‌హెచ్‌ఏఐకి ఏటా వస్తున్న రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చే ఐదేళ్లలో రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.‘భారత్‌మాలా ప్రయోజన’లో భాగంగా నిర్మిస్తున్న దిల్లీ`ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ విూదుగా వెళ్తోంది. ఇది అందుబాటులోకి వస్తే దిల్లీ, ముంబయికి మధ్య ప్రయాణ సమయం 24 గంటల నుంచి 12 గంటలకు తగ్గుతుంది. ఎన్‌హెచ్‌ఏఐ అప్పుల ఊబిలో కూరుకుపోతోందన్న ఆరోపణనను నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. ఈ నోడల్ ఏజెన్సీకి ‘ఏఏఏ’ క్రెడిట్ రేటింగ్ ఉందన్నారు. రానున్న కొన్నేళ్లలో కాసుల వర్షం కురిపిస్తుందన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ ఎప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోదని ధీమా వ్యక్తం చేశారు.
దిల్లీ`ముంబయి ఎక్స్‌ప్రెస్ వే పై నితిన్ గడ్కరీ టెస్ట్‌డ్రైవ్
దిల్లీ`ముంబయి ఎక్స్‌ప్రెస్ వే (దిఎంఈ) 2023 మార్చి నాటికి పూర్తవుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో… 1350 కి.విూ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి రూ.98వేల కోట్లు వెచ్చించగా.. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు గానూ నితిన్ గడ్కరీ.. కారులో 170కి.విూ వేగంతో ప్రయాణించారు. సాధారణంగా దిల్లీ నుంచి ముంబయి నుంచి వెళ్లాలంటే జాతీయ రహదారి ఎన్‌హెచ్48 (1421 కివిూ) ప్రయాణించాల్సి వస్తుంది. దిఎంఈ ఎక్స్‌ప్రెస్ హైవే కనుక అందుబాటులో వస్తే ఆ దూరం 70 కి.విూ. వరకు తగ్గుతుందన్నారు. అంతేకాదు.. 25గంటలు పట్టే ప్రయాణం తగ్గనుంది. సుమారు 12గంటలలోపే చేరుకోవచ్చన్నారు.