ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి
వరంగల్ : కేసముద్రం మండలం గాంధీపురంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.