ట్రావెల్ ఏజెన్సీపై దాడి
కోటి విలువ చేసే రైల్వే టిక్కట్లు స్వాధీనం
పాట్నా,జనవరి28(జనంసాక్షి): బిహార్ రాజధాని పట్నాలోని ఓ ట్రావెల్ ఏజెన్సీలో రూ.కోటి విలువ చేసే రైల్వే టికెట్లను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రైల్వే టికెట్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన ఆర్‌పీఎఫ్ అధికారులు 5 తత్కాల్, 93 రిజర్వేషస్ టికెట్లతో పాటు 3,085 టికెట్లను సీజ్ చేశారు. అక్కడికక్కడే ఇద్దరిని అరెస్టు చేసిన అధికారులు మూడు మొబైల్ ఫోన్లు, రూ.52 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓ ¬టల్ కేంద్రంగా ఈ అక్రమ దందా సాగుతున్నట్లు గుర్తించిన అధికారులు.. లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.



