ట్రోఫీ సాధించిన భారత హాకీ మహిళల జట్టు
ఆసియా హాకీ చాంపియన్స్‌లో అమ్మాయిలూ పోరాటంతో హోరెత్తించారు. 1-0తో తొలి అర్థభాగం ముగించింది భారత్. కాసేపటికే 1-1తో ఇరు జట్లు సమమయ్యాయి. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఒక వైపు మ్యాచ్ సమయం ముంచుకొస్తుంది. మరో వైపు గోల్ చేయాలనే ఒత్తిడి. అప్పుడే భారత్ చివరి నిమిషం చివరి క్షణాల్లో అద్భుతం చేసింది. చాకచక్యంగా ఫెనాల్టీ కార్నర్ సాధించిన భారత్… దీపికా కళ్లుచెదిరే గోల్‌తో డ్రాగన్‌కు షాకిచ్చీ చాంపియన్‌గా నిలిచింది. భారత్ ఫైనల్లో జయభేరి మోగించింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వీరోచిత విజయంతో ట్రోఫీనెత్తిన భారత్ చాంపియన్‌నంటూ ఎలుగెత్తి చాటింది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గ డంతో ప్రముఖుల,సెలెబ్రిటీల నుంచి ప్రశంసల వర్షం కురిసింది.