డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు.
జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు ఆడే గజేందర్ అన్నారు.శుక్రవారం రోజున జన హృదయనేత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానేత వైఎస్ హయాంలో పేద ప్రజలకు అభివృద్ధి వైపు నడిపించిన ఘనత మహానేత వైఎస్సార్ కాంగ్రెసేనని జనం గుండెల్లో ఎప్పటికి చెరగని ముద్ర వేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు ఆడే గజేందర్ మండల కాంగ్రెస్ నాయకులు ఆడే వసంత్ రావు,ప్రఫుల్ రెడ్డి జాధవ్ వసంత్ రావ్ తదితరులు పాల్గొన్నారు.