.డ్రగ్స్‌కు అడ్డాగా గుజరాత్
` రూ.9వేల కోట్ల హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్,సెప్టెంబరు 19(జనంసాక్షి): దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లో రూ. 9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ ముఠాకు విజయవాడతో సంబంధాలు ఉండటం గమనార్హం. నిఘా వర్గాల సమాచారంతో.. డీఆర్‌ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో తనిఖీలు చేయగా భారీగా హెరాయిన్ బయటపడిరది. వాటి విలువ దాదాపు రూ. 9వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ కంటైనర్లు అఫ్గానిస్థాన్ నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ ట్రేడిరగ్ సంస్థకు చెందినవిగా గుర్తించారు. టాల్కమ్ పౌడర్ ముసుగులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.