ఢిల్లీలో ఆటోమేటిక్‌ వాషింగ్‌ కోచ్‌ ఏర్పాటు

న్యూఢిల్లీ,జూలై17(జ‌నం సాక్షి): భారతీయ రైల్వేలో మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్‌ కోచ్‌ వాషింగ్‌ ప్లాంట్‌ నార్త్‌ రన్‌ రైల్వేలో ఏర్పాటైంది. ఢిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్‌లో ఈ ఆటోమేటిక్‌ కోచ్‌ వాషింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ విధానంలో నీటి పొదుపుతో పాటు కార్మికుల తగ్గింపు, సమయం ఆదా కావడం వంటి పలు ఉపయోగాలు ఉన్నాయి. పాత విధానంలో మ్యానువల్‌గా 1500 లీటర్ల నీరు కావాల్సి ఉండగా.. ఈ సరికొత్త విధానంతో కేవలం 240 లీటర్ల నీరు సరిపోతుందని అధికారులు వెల్లడించారు. రూ. 1.6 కోట్లతో నిర్మాణ వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ వాషింగ్‌ ప్లాంట్‌లో రోజులో 250 కోచ్‌లను శుభ్రపరచవచ్చు. 24 కోచ్‌లుగా గల రైలును కేవలం 7 నుంచి 8 నిమిషాల వ్యవధిలో శుభ్రపరుస్తుంది. వాటర్‌ రీసైక్లింగ్‌ సామర్థ్యం ఈ ఎ/-లాంట్‌ సొంతం.