తపాల ఉద్యోగుల సమ్మె.
ఫోటో రైటప్: బెల్లంపల్లిలో సమ్మెకు దిగిన తపాల ఉద్యోగులు.
బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి)
అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు,
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటకరణకు వ్యతిరేకంగా బుధవారం బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని పోస్టాఫీసుల్లో ఉద్యోగులు సమ్మెకు దిగారు.
దేశవ్యాప్తంగా అయిదు లక్షల మంది తపాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి తాజాద్దీన్ అన్నారు. ఈ సమ్మెకి కేంద్రప్రభుత్వ రంగ సంస్థల అన్ని సంఘాలు
ఐఎన్టీయుసి, ఎఐటియుసి, హెచ్ఎమ్మెస్, సిఐటియు, ఏఐటీయూసీ, యుటిసిసి, ఎస్ఇడబ్ల్యూఏ, ఐసిసిటీయూ, ఎల్పీఎఫ్, యుటిసిసి మద్దత్తు
ఇవ్వడము జరిగిందన్నారు. తపాలా వ్యవస్థలు కార్పోరేట్
శక్తుల నుండి, రాజకీయ నాయకుల వ్యతిరేక విధానాల నుండి
కాపాడుకోవడానికి 156434 తపాల కార్యాలయాలు ఒక్క
రోజు మూసి వేసి సమ్మె చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని
మధ్య, దిగువ తరగతికి చెందిన ఎంతో మంది ప్రజలు తమ
కశ్యర్జితం కనీసం ₹ 10 సహా దాచుకునే ఆర్థిక సంస్థ పోస్ట్ ఆఫీస్ అని అలాంటి పోస్ట్ ఆఫీసులో
దాదాపుగా 30 కోట్లు ప్రజలకు 10 లక్షల పోస్ట్ ఆఫీస్ ఉన్నాయన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి పూర్తి స్థాయి భద్రత ఉంటుందన్నారు. “పోస్ట్ ఆఫీస్ అంటే నమ్మకం నమ్మకం అంటే పోస్ట్ ఆఫీస్” అనే విధానం నుంచి ప్రభుత్వం
తప్పుకోవాలని చూస్తుందని భవిష్యత్ ప్రమాణాన్ని గమనించి
పోస్టల్ వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమములో నాయకులు సత్యనారాయణరావు,
బాబురావు, చింత సంతోష్, నాగేశ్వరరావు సహా
అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.