తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదు-న్యూడెమోక్రసీ
గుండాల,,సెప్టెంబర్2(జనంసాక్షి); ప్రజల ఏకాభిప్రాయం మేరకే మండలంలో చేపల సొసైటీ వద్దని మెజారిటీ ప్రజలు,చెరువు ఆయకట్టు రైతుల అభిప్రాయాల మేరకే మృత్యుశాఖ అధికారుల ముందు నిర్ణయం తీసుకున్నామని న్యూడెమోక్రసీ నాయకులు కోరం సీతారాములు, ముక్తి సత్యం గుండాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలలో ఏ మాత్రం నిజం లేదని , కొంతమంది సొంత స్వలాభం కోసం గిరిజనులకు గిరిజినేతరులు అని మాట్లాడడం సబబు కాదని అన్నారు.గ్రామస్థుల నిర్ణయాన్ని న్యూడెమోక్రసీ పార్టీకి రుద్దడం కరెక్టు కాదని ప్రజా ప్రతునిధులు గిరిజనేతరుల చేతిలో కీలుబొమ్మలుగా వున్నారు అని తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో మానాల ఉపేందర్,పర్షిక రవి,వై వెంకన్న,లాలయ్య,ఈసం కృష్ణ,బాణోత్ లాలూ తదితరులు పాల్గొన్నారు.