తమిళనాడులో బ్యాంక్ చోరీ
లాకర్ల నుంచి నగదు, నగలు దొంగతనం
చెన్నై,జనవరి28(జనంసాక్షి): తమిళనాడులోని త్రిచి జిల్లాలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో దొంగలుపడ్డారు. లాకలర్లనుంచి పెద్ద మొత్తంలో నగలు మాయమయ్యాయి. చెన్నై-త్రిచి హైవేపై సమయపురం వద్ద ఉన్న బ్యాంక్‌లో ఈ చోరీ జరిగింది. బ్యాంక్‌లో ఉన్న అయిదు లాకర్ల నుంచి నగదు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. చోరీకి గురైన మొత్తం కోట్లల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారమే ఈ చోరీ జరిగినా సోమవారం ఉదయం అధికారులు బ్యాంక్‌కు రాగానే.. లాకర్లు తెరిచి ఉన్నట్లు గమనించారు. పోలీసులు కథనం ప్రకారం.. శనివారం రాత్రి దొంగతనం జరిగింది. బ్యాంక్ గోడకు కన్నం వేసిన దొంగలు. లాకర్లను తెరిచి సొమ్మును కాజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఏవిూ తెలియరాలేదు. ఉదయం బ్యాంక్ తాళాలు తీసిన అధికారులు లాకర్లను చూసి షాక్ అయ్యారు. దొంగతనం ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.-



