తమ భూమిని ఇతరులకు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆందోళన

తూప్రాన్ జులై 28( జనం సాక్షి) ::: డీ కరెక్షన్ లో ఉన్న తమ భూమిని డి కరెక్షన్ నుండి తొలగించాలని దరఖాస్తు చేసిన తహసిల్దార్ ఇతరులకు మార్చే ప్రయత్నాలు చేస్తుందని బాధితులు నర్సంపల్లికి చెందిన జింక చంద్రశేఖర్ శ్రీశైలం నవీన్లు తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు జింక చంద్రశేఖర్ శ్రీశైలంలు నర్సంపల్లి శివారులో గల 233/ ఆ/1/2 లో జింక చంద్రశేఖర కరుణ ఎకరా 10 గుంటలు శ్రీశైలం పేరున 30 గుంటలు భూమిని జింక నవీన్ వద్ద నుండి గత నాలుగు సంవత్సరాల క్రితం ఖరీదు చేసుకుని పాస్ పుస్తకం తీసుకున్నట్లు వారు తెలిపారు ఇటీవల అట్టి భూమిని డీకరేక్షన్లో రికార్డులో ఉండడంతో డి కరెక్షన్ నుండి తొలగించాలని తాము తాసిల్దార్ కార్యాలయం వద్ద దరఖాస్తు చేసుకున్నామని వారు తెలిపారు తమ గ్రామానికి చెందిన కొందరు బ్రోకర్లు లంబాడి బికియా పేరున మార్చడానికి ఆరేచి ఇటీవల సర్వే చేయించారని వారు ఆరోపించారు ఈ విషయంపై తహసిల్దారును అడగడానికి వస్తే ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు ఆలోచించారు పాము రిజిస్టర్ ప్రకారం కర్రీ చేసుకొని కొన్నామని తమ భూమిని వేరే వారికి మారిస్తే ఊరుకునేది లేదని పై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు ఈ విషయంపై తాసిల్దార్ జ్ఞాన జ్యోతిని వివరణ అడగగా గత నాలుగు నెలల క్రితం బిఖ్య అనే వ్యక్తి మూడు ఎకరాలకు సంబంధించిన పత్రాలను రికార్డులతో మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారని జింక చంద్రశేఖర్ శ్రీశైలంలు వారికి సంబంధించిన పత్రాలను తమకు ఇచ్చారని ఇరువురి పత్రాలను పరిశీలించిన అనంతరం గ్రామస్తులు సమక్షంలో సర్వే చేయించి కలెక్టర్కు రిపోర్టు పంపిస్తామని ఆమె చెప్పారు

తాజావార్తలు