తల్లిపాలు బిడ్డకు అమృతం
శివ్వంపేట ఆగస్ట్ 6 జనంసాక్షి :
తల్లిపాలు బిడ్డకు అమృతం వంటివని అంగన్వాడి టీచర్ లు పేర్కొన్నారు. మండల పరిధిలో దొంతి గ్రామంలో శనివారం గర్భిణీ బాలింతల మహిళలకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు భాగంగా అవగాహన సమావేశం ఏర్పాటు చేసి తల్లిపాల ప్రాముఖ్యతను, బిడ్డ శరీరా, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాలు తల్లి పాలలో ఉంటాయని బిడ్డ పుట్టగానే తల్లిపాలు ఆరు నెలల వరకు పట్టాలని, పౌష్టిక ఆహారం, బాలమృతం గురించి గర్భిణీలతో పాటు పసిబిడ్డల తల్లులకు అవగాహన కల్పించారు. అలాగే ఏడు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రసాదం అందించారు. మరీ కొందరి పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రామకృష్ణ, టీఆరెఎస్ మండల ప్రచార కార్యదర్శి బుద్ధుల బిక్షపతి అంగన్వాడి టీచర్లు బి. హేమలత, జ్యోతి, ఫాతిమా లతో పాటు ఆశా వర్కర్లు మాధవి తదితరులు పాల్గొన్నారు.