తల్లిపేరుతో స్కూలు ప్రారంభించిన రాజమౌళి

విశాఖపట్టణం,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): చిన్నారులకు ఆటలు ఆడుకునేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఉపాధ్యాయులకు సూచించారు. చిన్నారులు తరగతి గదుల్లో కంటే ఆట స్థలంలోనే ఎక్కువ నేర్చుకుంటారన్నారు. విశాఖ జిల్లా కశింకోటలో తన తల్లి పేరు విూద నిర్మించిన పాఠశాల భవనాన్ని తన భార్య రమతో కలిసి రాజమౌళి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పనితీరును రాజమౌళి ప్రశంసించారు. రాజమౌళి దంపతులను చూసేందుకు పెద్దయెత్తున ప్రజలు తరలిరావడంతో అక్కడ కోలాహలం నెలకొంది.