తహసిల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు మహాపడావ్ -ధర్నా

టేకులపల్లి,ఆగస్టు 10 (జనం సాక్షి): దేశవ్యాప్తంగా కార్మిక, సంఘాల ఆధ్వర్యంలో రెండు రోజులు మహా పడవ్ కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట, గురువారం టేకులపల్లి తహసీల్దారు కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కుంజ హైమావతి అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనాల చట్టాన్ని మెరుగుపరచాలని, దేశీయతంగా ఉన్న వివిధ స్కీమ్ వర్కర్లు,అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ పథకాలను పెంచాలని, కనీస పెన్షన్ పదివేల రూపాయలు అమలు చేయాలని, కార్మిక, ఉద్యోగ వర్గానికి భద్రత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ఆదాని, అంబానీలకు కట్టబెట్టొద్దని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాయ్ వాలా ఈ దేశానికి ప్రధాని అయితే భారతదేశం గత ప్రభుత్వాల కంటే మంచి పరిపాలన అందిస్తారని అనుకున్నారు, కానీ మతవిద్వేషాలను రెచ్చగొట్టుడు, బేటి పడావో,బేటి బచావో మన్ కీ బాత్, అని తీయటి మాటలు చెబుతూనే మణిపూర్లో అత్యంత దారుణంగా కిరాతకంగా బిజెపి ప్రభుత్వంలో నగ్నంగా నడి బజార్లో మహిళలను ఊరేగిస్తుంటే ఈ దేశ ప్రధాని నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా రైతు చట్టాలను తీసుకు రావడానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని 14 నెలలుగా దిగ్బంధం చేసి నరేంద్ర మోడీ తెచ్చిన నల్లచట్టాలను రద్దు చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెర వేర్చాలన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ

తాజావార్తలు