తాండూర్ ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్

తాండూర్,ఆగష్టు11(జనంసాక్షి):
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్య్ర భారత వజ్రోత్సవ మహోత్సవ వేడుకలలో భాగంగా గురువారం 11.08.22 రోజున తాండూర్ ఐ బి లో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ లో బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ , సి ఐ జగదీష్ , తాండూర్ ఎస్ ఐ సమ్మయ్య, ఎంపీపీ ప్రణయ్ కుమార్ , జడ్పీటీసీ బానయ్య ,ఎంపీటీసీ సిరంగి శంకర్ , ఎం పి డి ఓ ప్రవీణ్ కుమార్, మరియు రెవిన్యూ సిబ్బంది,పోలీసు సిబ్బంది,ఐ.కె.పి సిబ్బంది, పంచాయతీ రాజ్ సిబ్బంది,పంచాయతీ కార్యదర్శలు, ఐ.సి.డి.ఎస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది తాండూర్ గ్రామ యువతి యువకులు పెద్ద ఎత్తున ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్నారు.