తాండూర్ లో సామూహిక గీతాలపన.
తాండూర్, ఆగస్టు16, (జనంసాక్షి)
తాండూర్ మండలంలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జాతీయ గీతాలపన కార్యక్రమం చేపట్టారు. దేశ ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 11-30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించినట్లు ఎం పి పి ప్రణయ్ కుమార్ పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో, అన్ని గ్రామాల ప్రధాన కూడళ్లలో చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.