తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి వేడుకలు.
పోటో రైటప్: కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకుంటున్న సేవా సమితి సభ్యులు.
బెల్లంపల్లి, ఆగస్టు26, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం మదర్ థెరిస్సా 112వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మదర్ థెరిస్సా జయంతి సందర్బంగా తాండూర్ మండల కేంద్రంలోని కత్తెర్ల గ్రామంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం తాజ్ బాబా సేవాసమితి అధ్యక్షులు ఉస్మాన్ పాషా, సలహాదారుడు హాజీ హబీబ్ పిల్లలకు పుస్తకాలు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఉస్మాన్ పాషా మాట్లాడుతూ ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కలకత్తా మురికి వాడల్లోని ఎందరో అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా అని కొనియాడారు. తోటి వారికీ సహాయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసి కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరి సహాయం చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేసి ప్రపంచ దేశాలతో అమ్మ అని పిలిపించుకున్న మహనీయురాలు అన్నారు. నేటి తరం యువత మదర్ థెరిసా లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో తాజ్ బాబా సేవాసమితి సభ్యులు హాజి బాబా, శ్రీనులాల్, ఉమేర్ నావాజ్ తదితరులు పాల్గొన్నారు.