తాడిచర్ల కళాశాల విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు

మల్హర్, జనంసాక్షి
మండల కేంద్రమైన తాడిచర్ల లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని విద్యార్థులకు 75 వ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం  డ్రాయింగ్, పేయింటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజ్ మాట్లాడుతూ ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల దేశభక్తి తో పాటు విద్యార్థుల యొక్క సృజనాత్మతకు మంచి నడవడికకు దోహద పడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రవింధర్, అధ్యాపకులు రవి, జయపాల్, ఉమామహేశ్వరి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.