తెదేపా నేతలు మద్దతు పలికిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఖమ్మం : బయ్యారం గనుల వ్యవహారంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా తెరాస నేతలు మాట్లాడటం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఖమ్మం బస్టాండ్‌ వద్ద సీపీఐ 48 గంటల దీక్ష  చేపటింది. దీక్షలో నారాయణ పాల్గొని ప్రసంగించారు. బయ్యారం గనుల విషయంలో మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండి పడ్డారు. ఈ దీక్షలకు తెదేపా నేతలు మద్దతు పలికారు.