తెరాస అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్
ఆర్మూర్, జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఎన్నికయ్యారు. కేసీఆర్ వరుసగా ఏడోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఎన్నికను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరుగుతున్న తెరాస ఆవిర్భావ సభలో ఆ పార్టీ ఎన్నికల అధికారి నాయిని నర్సింహారావు ప్రకటించారు.