తెలంగాణలో కుటుంబ పాలన: కేంద్ర మంత్రి రాధాకృష్ణన్
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని కేంద్రమంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వరంగల్ లోని నక్కలగుట్టలో బీజేపీ మేథావుల సదస్సు గురువారం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని, యాదాద్రి – భూపాలపల్లి జాతీయ రహదారికి రూ.1997 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మాట్లాడుతూ… మతప్రాతిపదికన ప్రజలను చీల్చే ప్రయత్నం జరుగుతుందని, కులాలు, మతాలతో కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుతున్నారని, మతపరమైన రిజర్వేషన్లపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.