తెలంగాణవాదుల నిర్బంధం
మహబుబ్‌నగర్: కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర నేపథ్యంలో మానవపాడు, శాంతినగర్, ఒడ్డెపల్లిలో తెలంగాణ వాదులకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలిసులు నిర్భంధించారు. డీసీసీ ఆధ్దర్యంలో మంత్రి డీకే అరుణ చేపట్టిన బస్సుయాత్రను తెలంగాణ వాదులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల ప్రసంగాలను కోల్లాపూర్‌లో నిన్న తెలంగావాదులు, టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్ దాడులకు భయపడబోమని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.