తెలంగాణా కవి ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ గారి జయంతి
జనం సాక్షి ప్రతినిధి మెదక్ – 09.09.2022.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు తెలంగాణా కవి ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు మాట్లాడుతూ…. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ గారు అని ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు అని అన్నారు. “కాళోజీ కాళన్న”గా సుపరిచితులు అని తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడ్డాడని. కాళోజీ గారు రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి గారి జీవితం పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు అని స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించిందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి.డా.శ్రీ.బి.బాలాస్వామి ఐ.పి.ఎస్ గారు,ఎస్.బి సి.ఐ శ్రీ.నవీన్ బాబు గారు, డి.సి.ఆర్.బి సి.ఐ.శ్రీ.రవీందర్ గారు, మెదక్ పట్టణ సి.ఐ.శ్రీ.మధు గారు,మెదక్ రూరల్ సి.ఐ.శ్రీ.విజయ్ గారు, ఐ.టి.కోర్ ఎస్.ఐ సందీప్ రెడ్డి గారు, మరియు జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు