తెలంగాణ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్‌

సాకారం కాబోతున్నకోటి ఎకరాల తెలంగాణ మాగాణం

కాంగ్రెస్‌కు నిజంగానే నూకలు చెల్లాయి: ఇర్రి

జనగామ,జూన్‌26(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని, దీనిని ప్రతి ఒక్కరూ సందర్శించి తెలుసుకోవాలని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులం దీనిని సందర్శించి తెలుసుకోవడం ద్వారా తెలంగాణలోఅద్భుతమైన ప్రాఎక్ట్‌ రాబోతున్నదని గుర్తించామని అన్నారు. కోటి ఎకరాల తెలంగాన మాగాణం అంటున్న సిఎం కెసిఆర్‌ అందుకు ఎలా కృషి చేస్తున్నారో ఈ ప్రాఎక్ట్‌ నిర్మాణ పనులు చూశాక మరింతగా అర్థంఅ య్యిందని అన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, సుమారు వేయి మంది ప్రాజెక్ట్‌ను సందర్శించారని అన్నారు. కాంగరెస్‌ నాయకులు దీనిని జీర్ణించుకోలేకనే పదేపదే విమర్వలు చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే నిజంగానే కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లినట్లేనని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు అంతర్భాగంగా ప్రధానమైన కన్నెపల్లి పంప్‌హౌజ్‌, మేడిగడ్డ, అన్నారం, సుందళ్ల బ్యారేజీని సందర్శించిన తమకు అద్భుతాలు తెలంగానలో జరుగుతన్నాయిన గుర్తించామని అన్నారు. ప్రాజెక్టు, బ్యారేజీ వద్ద ప్రస్తుత నిర్మాణ పనుల పురోగతిని కంపెనీ ప్రతినిధులు, అక్కడి ఇంజినీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నామని అన్నారు. కాళేశ్వరంప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనుల తీరు అద్భుతమని, ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో రైతుల కన్నీటి కష్టాలు తీరి పాడిపంటలతో సస్యశ్యామలంగా మారుతుందన్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని, దీని వల్ల తెలంగాణలోని కోటి ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించిన ఏకైక ప్రాజెక్టుగా చరిత్రలో నిలవడంతో పాటు నిర్మాణ పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని, ఇంత వేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకోవడం దేశ చరిత్రలోనే పప్రథమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఇలాంటి బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.తెలంగాణ ప్రాంతంలోని రైతుల అభివృద్ధికి సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని, బంగారు తెలంగాణ సాధనలో కేసీఆర్‌తో పాటు తాము సైతం భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.