తెలంగాణ ఏర్పాటుకు చిరంజీవి కృషి చేయాలి : గుత్తా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చిరంజీవి కృషి చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. గత ఎన్నికల సందర్భంగా సామాజిక తెలంగాణ ఇస్తామన్న చిరంజీవి ప్రకటనలను ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఉత్యమంపై మంత్రులు టీజీ, గంటా చేసిన వ్యాఖ్యాలను ఆయన ఖండించారు. తెలంగాణ ప్రాంతంలో రాజకీయాల్లో వున్న వ్యాపారవేత్తలెంతమందో తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు.