తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ విస్తరణపై ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి సీఎం తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఆ రోజు ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.