తెలంగాణ ఛత్రపతి శివాజీ గా పేరొందిన బహుజన వీరుడు శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు

.

శుక్రవారం వీడియో కాన్ఫిరెన్స్ సమావేశ మందిరంలో శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ , 373 వ జయంతి ని జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈసంధర్బముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 13 వ, శతాబ్దం లో బడుగుబలహీన వర్గాలకోసం, సమాన హక్కులకోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారుడు శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు , అందరి మహనీయుల చరిత్ర గురించి అందరికి తెలియ జేయాలని అన్నారు. భూమి హక్కుల కోసం పెత్తందారుల , జాగీర్ధారుల నిరంకుశపాలన పై ఎదిరించి పోరాడిన యోధుడు , పోరాటపటిమతో సైన్యాన్ని తయారు చేసి బ్రిటీష్ ప్రభుత్వాలతో పోరాడి ,స్వాతంత్ర సంగ్రామం లో నూ పాల్గొన్నారని తెలిపారు . అన్ని కులాలతో సైన్యం ఏర్పాటు చేసి రాజులను ఎదిరించి కాకతీయ కోటను ఆక్రమించుకొని, గోల్కొండ కోట వరకు జయించారని ,గొలుసుకట్టు చెరువులను నిర్మించారని అన్నారు . మహనీయులు ఏ ఒక్క కులాని కోసం కాకుండా అందరి కోసం పాటుపడ్డారని అన్నారు.

బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పతకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు. వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక గురుకులాల ఏర్పాటు, సంక్షేమ పథకాల అమలు, ఆస్పత్రుల నిర్మాణం వంటి ఎన్నో చేపట్టడం జరిగిందని, పాఠశాలలతో పాటు, హాస్టల్లు ,విద్యాలయాలను నిర్మించి అందరు ఎదిగేలా అవకాశాలు కల్పించామన్నారు. పాఠశాలలతో పాటు, హాస్టల్లు ,విద్యాలయాలను నిర్మించి అందరు ఎదిగేలా అవకాశాలు కల్పించామన్నారు. ఆయన సేవలు స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ,డి ఆర్ ఓ పద్మశ్రీ , మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జునగౌడ్ , ఎక్ససైజ్ సూపరింటెండెంట్ ఎం ,ఏ రజాక్ , సీఐ నరేందర్ గౌడ్ , జిల్లా బి సి సంక్షేమ అధికారులు శంకర్నాయక్, నాగరాజ్ గౌడ్ , పట్టాన గౌడ సంఘం అధ్యక్షులు గడ్డమీది కృష్ణ గౌడ్ , కౌన్సలర్ దొంది లక్ష్మి ముత్యం గౌడ్ , జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారాం , వివిధ కుల సంఘాల నాయకులు, అధికారులు, గీతకార్మికులు ,సంఘ సభ్యులు,సంబంధిత అధికారులు సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు .