తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బాలకవి సమ్మేళనం.

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే కవి సమ్మేళనం.
తెలంగాణ జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ.
తాండూరు అగస్టు 18(జనంసాక్షి)స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని తెలంగాణ సారస్వత పరిషత్తులో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన బాల కవుల సమ్మేళనానికి వికారాబాద్ జిల్లా నుండి వివిధ పాఠశాలల ఎన్నుకోబడిన బాల కవులు( విద్యార్థులు) పాల్గొని,కవిత్వాలు పద్యాలు ఆలపించారు.ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ మాట్లాడుతూ
వికారాబాద్ జిల్లాలో ఉన్న విద్యార్థుల అపారమైన తెలివితేటలు వెలికితీయడంలో తెలంగాణ జాగృతి నిర్వహించిన బాలకవి సమ్మేళనం ఎంతో దోహదపడిందన్నారు. దేశభక్తిని విద్యార్థులలో పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఖండాంతరాలు దాటి విదేశాల్లో విస్తరింపజేస్తున్న తెలంగాణ జాగృతి సేవలు అమూల్యమైనవని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర శాఖ పక్షాన ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలకవులకు సత్కారం చేసి,మెమోంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు కుమ్మరి శ్రీనివాస్ ,జాగృతి తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ దత్తాత్రేయ, వివిధ పాఠశాలల బాలకవులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మున్నురు రాజు, అంజిలప్ప, ప్రశాంత్ పాటీల్ తదితరులు పాల్గొన్నారు.