తెలంగాణ దళిత సంఘాల గోడపత్రిక అవిష్కరణ
సైదాపూర్ : బాజపా రాష్ట్ర అధ్యక్షుడు అంబర్‌పేట శాసనసభ్యడు జి. కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని గాందీనగర్‌లో శుక్రవారం తెలంగాణ దళిత సంఘాల గోడపత్రికను అవిష్కరించారు. ఈ నెల 29న హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించనున్న తెలంగాణ దళిత సంఘ ఐక్య కార్యాచరణ రాష్ట్ర సమితి మూడో వార్షికోత్సవ సభను పురస్కరించుకోని ఈ కార్యక్రమం కోనసాగింది. అధిక సంఖ్యలో సభలో పాల్గోనాల్సిందిగా సమితి ఉపాధ్యక్షుడు ఎ. రమేశ్ ఈసందర్బంగా దళితులను కోరారు. అవిష్కరణ కార్యాక్రమంలో సమితి అధ్యక్ష కార్యదర్శులు చల్లమల్ల సునీల్, కె. అశోక్ పాల్గోన్నారు.