తెలంగాణ నెలంతా మొక్కలతో పులకరించాలి
జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారాఖి
నిర్మల్ బ్యూరో, ఆగస్టు21,,జనంసాక్షి,,, ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా కేంద్రంలోని బైంసా రోడ్ మంజులాపూర్ ప్రాం తంలో రోడ్డు వెంబడి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ,అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే ,జడ్పి చైర్మన్ కె.విజయలక్ష్మి-రాంకిషన్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ లు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ నేలాంత పులకరించే విధంగా మొక్కలు నటడమే కాకుండా నాటిన మొక్కలను సంరక్షించే విదంగా చర్యలు తీసుకోవాలన్నారు.మున్సిపాలిటీ ల్లో ఎక్కువ మొక్కలు నాటేలా ముఖ్యమంత్రి సూచించారన్నారు.ఈ హరితహార కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ బాగస్వాములై మొక్కలు నాటాలని సూచించారు.కమిషనర్ అరిగెల సంపత్ కుమార్,సానిటరీ యస్ .ఐ -దేవిదాస్, మురారి,రీటైడ్ డి.ఈ-శ్రీనివాస్,కౌన్సిలర్స్ , నాయకులు,మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు