తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కేంద్ర విధానాలను తిప్పికొట్టాలి.

 

ఐటీ మున్సిపల్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.

విద్యుత్ సంస్కరణ చట్టాలపై మండిపాటు.

సిరిసిల్ల. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కేంద్ర విధానాలను తిప్పికొట్టాలి…
ఐటీ మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
గురువారం జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చే విధానాలతో తీవ్రంగా నష్టపోయేది తెలంగాణ రాష్ట్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదాని, అంబానీల కోసం ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయకంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం లో విద్యుత్ సంస్థలను అమలు చేయడం వల్ల సిరిసిల్ల పవర్లూమ్ కుటీర పరిశ్రమలతో పాటు ఇతర వృత్తులపై ఆధారపడిన సామాజిక వర్గాలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని అన్నారు. ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రైతులు అర్దం చేసుకోవాలని కోరారు. ఫలితంగా వ్యవసాయ పరపతి సంఘాలతో పాటు ధాన్యం సేకరిస్తున్న స్వశక్తి సంఘాలు నిర్వీర్యమై పరోక్షంగా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక వ్యవస్థ పై అవగాహన లేని మోడీ విధానాల వల్ల ప్రపంచంలోనే అత్యధిక పేదలున్న దేశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విద్యుత్ సంస్థలను విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తూ వచ్చిన స్పందించడం లేదని అన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసి ప్రజలపై భారము మోపి విధానాలను తిట్టి కొట్టేందుకు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్పొరేట్లకు వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ ప్రజలకు ఉచితం అంటూ తప్పుడు ప్రచారాలను చేస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. సమావేశంలో వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ పాల్గొన్నారు