తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం సాహస నిర్ణయం టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ సమత్
మోమిన్ పేట సెప్టెంబర్ 21 జనం సాక్షి
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించే సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయడం సాహస నిర్ణయం అని టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుల అబ్దుల్ సమద్ పేర్కొన్నారు బుధవారం
మోమిన్ పేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహస నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమైందని ఆయన అన్నారు దేశ నలుమూలల గర్వించదగ్గ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని పకడ్బందీగా అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు స్వాగతం పలుకుతున్నాయన్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు నూతన పార్లమెంట్ భవనానికి కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆయన సూచించారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన కోరారు
Attachments area