తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం.

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
తాండూరు ఆగస్టు 29 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెల్లడించారు.సోమవారము తాండూరు పట్టణం భవాని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన
సమావేశంలో మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన 1562 మంది లబ్ధిదారులకు
నూతన ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 36 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లను అందిస్తుందని, మరో 10 లక్షల మందికి నూతన పెన్షన్లను లబ్ధిదారులకు మంజూరు చేసిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గొప్ప సాహసం దాతృత్వం తో కూడిన ఆలోచన 50 లక్షల మంది అభాగ్యులైన వృద్ధులకు, వితంతువుల కు, దివ్యాంగులకు ఒంటరి మహిళలలకు ఆసరా పెన్షన్లను అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.పింఛన్ రానివారు అదైర్యపడవద్దని అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్స్ వస్తాయని అప్లై చేసుకొని వారు ఉంటే చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో తాండూరు ఎంపీపీ అనిత గౌడ్, జెడ్ పి టి సి మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ ఎంపీపీ స్వరూప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ రామలింగ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ శంశుద్ధిన్, టీఆర్ఎస్ మహిళా కో ఆర్డినేటర్ శకుంతల సీనియర్ నాయకులు ఉమా శంకర్,సర్పంచులు మరియు ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.