తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు

జనం సాక్షి ప్రతినిధి మెదక్
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు భారతీయ జనతాపార్టీ మెదక్ జిల్లా కార్యాలయం లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని మరో పేరుతో సమైక్య దినోత్సవంగా జరుపుతూ ఆనాడు తెలంగాణ వీరుల కనీసం కూడా స్మరించుకోవడం పోవడం అమానుషం.
కేవలం ఒక ఎంఐఎం పార్టీ తొత్తుగా వ్యవహరిస్తూ ఎంఐఎం పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అనుసరించడం సిగ్గుచేటు .
• నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలకు వ్యతిరేక పోరాటాల ఫలితమే తెలంగాణ విమోచనం…
• తెలంగాణ విమోచనం రోజున తెలంగాణ ప్రజలు ఊచకోత కోసిన నిజాం పేరు చెప్పే దైర్యం లేని నీకు ముఖ్య మంత్రిగా కొనసాగే ఆర్హత లేదు… తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
• తెలంగాణ అంటేనే పోరాటాల పురిగి గడ్డ…. ఉద్యమాలకు పెట్టింది పేరు అలాంటి… ఎంతో మంది పోరాటాల ఫలితం అయిన తెలంగాణ విమోచనాన్ని సమైక్యతా దినోత్సవంగా జరుపడం అంటే తెలంగాణ వీరులను అవమాన పరచడమే
• తెలంగాణ స్వాతంత్ర ఉత్సవాలు అధికారికంగా జరుపుకోడానికి 8 ఏళ్లు పట్టింది
• భాతర దేశ స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలు… తెలంగాణ ప్రజలు త్యాగాలు కూడా అంత గొప్పవి.. బ్రిటీషు వారి కంటే నిజాం రజాకార్ల సైన్యం చేసిన ఆకృత్యాలు చాలా క్రూరంగా ఉండేవి… తెలంగాణ ఆడబిడ్డలను వివస్త్రను చేసి బ్రతుకమ్మ అడించిన నిజాం అకృత్యాలను ప్రజలకు చెప్పకపోవడం సిగ్గుచేటు కేసీఆర్
• 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ నీకు తెలంగాణ చరిత్ర నిజాం అరాచకాలు కనిపించలేదా…. నీ స్వార్ధం కోసం ఎంఐఎం ఓట్లకోసం నిజాంను పోగుడుతున్నావ్..
• నిజాం ను పొగడడం అంటే తెలంగాణ విమోచన పోరాట వీరులను అవమాన పరచడమే
• బాజపా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడింది.. పార్లమెంటు లో ఓటు వేసి తెలంగాణ బిల్లకు మద్దతు తెలిపి తెలంగాణ ప్రజల కళను సాకారం చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ విమోచనాన్ని మోది ప్రబుత్వం అధికారికంగా నిర్వహిస్తూ వీరుల పోరాటాలు.. వారి త్యాగాలను స్మరించుకుంటుంది.
• దేశంలోని 560కి పైగా సంస్థానాలు విలీన ఒప్పందం చేసుకుని భారతదేశంలో కలిసాయి కేవలం హైదరాబాద్ మాత్రమే సైనిక చర్య ద్వారా విమోచనం పొందింది.
• సెప్టెంబరు 17ను మహరాష్ట్ర ప్రభుత్వం… మహరాష్ట్ర ముక్తి దివస్ గా, కర్నాటక ప్రభుత్వం కర్నాటక ముక్తి విమోచన దినారణ పేరుతో స్వతంత్ర ఉత్సవాలు జరుపుకుంటంటే తెలంగాణ ఉద్యమ నాయకున్ని అని చెప్పుకునే నీకు తెలంగాణ స్వతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా జరిపే దైర్యం లేదు…. నువు ఉద్యమకారునివా… పిరికిపందవా అలోచించుకో.
• రాజాకార్ల వారుడు అసుదుద్దిన్ రాసిచ్చిన స్రిప్టు ప్రకారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని… జాతీయ సమైక్యతా దినోత్సవం అని ప్రకటించిన కేసీఆర్… విమోచనానికి… జాతీయ సమైక్యతకు అర్ధం తెలియని సన్నాసి…
• సెప్టెంబరు 17న నిజాం దక్కన్ రేడియో ద్వారా సాయుధ దళాలకు లొంగిపోతున్నట్లు… యుద్దం విరమించుకుంటున్నట్లు.. రజాకార్లను బందీలుగా తీసుకోమని స్వయంగా సర్ధార్ పటేల్ను అభ్యర్ధించాడు… ఒక మతం ఒట్లకోసం చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నావు.
• ప్రగతి భవన్… ఫాం హౌస్ లనుండి బయటకు వచ్చి… తెలంగాణ కోసం రక్తం చిందించిన వీరులకన్న నేలలు వీర భైరాన్పల్లి.. పరకాల అమరధామం… గుండ్రాంపల్లిలను సందర్శించు తెలంగాణ తెలంగాణ పోరాట చరిత్ర కనిపిస్తది…
• భారత దేశానికి స్వాతంత్ర వచ్చాక ఏడాది వరకు నిజాం తెలంగాణ త్రివర్ణ పతాకాన్ని ఎగురనివ్వలేదు… తెలంగాణ వచ్చి 8ఏళ్లవరకు తెలంగాణలో అధికారికంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురనివ్వలేదు… రజాకార్ల కంటే ప్రమాదకారికి నువు..
• ఎంఐంఎ తో కలిసి తెలంగాణ రజాకార్లకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న కేసీఆర్ నీకు నిజాంకు పట్టిన గతే పడుతుంది..

 

ఇట్టి నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ గారు రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి గారు జిల్లా ప్రధానకార్యదర్శి విజయ గారు యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉదయ్ కిరణ్ గారు పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ గారు నాయకులు మధు జనార్దన్ MLN రెడ్డి
ప్రభాకర్ సతీష్ నర్సింలు నాగరాజు మల్లేష్ పాల్గొన్నారు