తెలంగాణ వ్యాప్తంగా జోరుగా పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణ పది జిల్లాలు జై తెలంగాణ నినాదాలతో మారుమోగుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా తెగడపల్లి మండలం రాంభద్రునిపల్లె , ఏడుమోటలపల్లెలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ పల్లెబాటలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి , ఓదెల మండలం ఉప్పరపల్లిలో పల్లెబాట జోరుగా కొనసాగుతుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం దర్పల్లి, ఇటిక్యాల మండలం నోముల, దేవరకద్ర మండలం గద్దేగూడెం, కొడంగల్‌ మండలం చిననందిగామ లో టీఆర్‌ఎస్‌ పల్లెబాటలో కార్యకర్తలు ఉత్సహాంగా పాల్గొని ప్రజలకు తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.