తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలి
మునుగోడులో ఓట్లు సాధించడానికి చింత ప్రభాకర్ కు పదవి
మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్
నర్సాపూర్. సెప్టెంబర్, 14, ( జనం సాక్షి ) :
తెలంగాణ రాష్ట్రం లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని టిఆర్ఎస్ పార్టీ మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ అన్నారు.
బుధవారంనాడు ఆయన నర్సాపూర్ పట్టణంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న వారికి జనాభా దామాషా ప్రకారం పదవులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్లు సాధించడం కోసమే సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ కు హ్యాండ్లూమ్ చైర్మన్ పదవి కేటాయించినట్లు చెప్పారు. కొత్తవారిని చేర్చుకొని వారికి పదవులు కట్టబెట్టే సంస్కృతి కేవలం టిఆర్ఎస్ పార్టీలో మాత్రమే ఉందని ఆరోపించారు. ప్రగతి భవన్ లో కి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పనిచేసిన ఉద్యమకారులను ఎంతోమందిని టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎరుకల యాదగిరి, మాజీ వార్డు సభ్యుడు రమేష్, నాయకులు రమేష్ యాదవ్, చంద్రు, దేవేందర్ యాదవ్, నగేష్ గౌడ్, రమేష్ తదితరులు ఉన్నారు.
Attachments area