తెలంగాణ సిద్ధంగా కర్త జయంతి ఘనంగా జరిగింది.

నెరడిగొండ ఆగస్టు6(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతినీ మండల ఎంపీపీ రాథోడ్ సజన్,తహశీల్దార్ పవన్ చంద్ర ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం నందు శనివారం రోజున ఘనంగా నిర్వహించడం జరిగినది.నాల్గు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచాని చాటిచెప్పిన తొలి మహాజ్ఞాని ఉద్యమ స్ఫూర్తిదాత ఆచార్య జయశంకర్ జయంతిని నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ తసీల్దార్ పవన్ చంద్ర తోపాటు సీనియర్ అసిస్టెంట్ మిరాబాయి ఆర్ఐ నాగోరావు కార్యాలయ సిబ్బంది మండల నాయకులు మాజీ పీఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్ గులాబ్ సింగ్ శివారెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.