తొగర్ల సురేష్ “మట్టి కుండ” కవిత సంకలనం ఆవిష్కరణ


ముప్కాల్( జనం సాక్షి) మార్చ్
మండల పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ ఇన్చార్జ్ ఎస్సైగా పనిచేస్తున్న తొగర్ల సురేష్ రచించిన “మట్టి కుండ” కవితా సంపుటిని ఉగాదిని పురస్కరించుకుని ఇందూరు యజ్ఞ సమితి సంస్కార భారతి ఆధ్వర్యంలో అధ్యక్షుడు మూడ నాగభూషణం గుప్త పుస్తకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమాన్ని ఇందూరు యువత సంస్థ సహకారంతో హోటల్ నిఖిల్ సాయి నందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ నీతి కిరణ్ కవులు అభ్యుదయ వాదులనీ సమాజాన్ని కవితలతో మేలుకొలుపుతున్న గొప్ప వారిని ప్రశంసించారు తర్వాత ఆయనను ఘనంగా సన్మానించారు